*చెప్పాలనివుంది..గుండె గొంతు విప్పాలని వుంది…!!
*నీకు మాత్రమే వినిపించాలని దాచినమాట..!!
*నువ్వంటే …వేల ఆకాశాలంత ఇష్టం..!!
రమాదేవి మార్క్ కవిత ఇది..ఇందులో రహస్యం ఏదీలేదు.అతగాడికి మాత్రమే వినిపించాలని దాచిన మాట ఇది..ఇంతకూ ఆ మాట ఏమై వుంటుంది?
తెలుసుకునే ముందు మీరూ.. ఓ సారి ఈ కవితను చదవండి.!!
“అప్పుడప్పుడు
తడబడుతూ
తడుముకుంటూ చెప్పాలనిపిస్తుంది
గుంపు మధ్యన
గుసగుసగా చెప్పాలనిపిస్తుంది
ఎవరూ లేని చోట
ఆదమరిచి అరిచి చెప్పాలనిపిస్తుంది
ఓ చప్పుడు చేయని మాట
తడవ తడవకు తలిచే మాట
రహస్యమేమీ కాదు
నీకు
మాత్రమే వినిపించాలని దాచిన మాట
ఓయ్...
నువ్వంటే ఎంతో ఇష్టం
వేల ఆకాశాలంత ఇష్టం”.!!
*రమాదేవి ఆర్..!!
ఓయ్.!…నువ్వంటే ఎంతో ఇష్టం.ఎంతిష్టమంటే చెప్పలేనంత ఇష్టం..ఇంకా చెప్పాలంటే వేల ఆకా
శాలంత ఇష్టం..అదేంటి ఆకాశం ఒకటే కదా!వుండేది..మరి ఈమె ఏమిటి వేయి ఆకాశాలంటోందన్న
అనుమానం రావొచ్చు..అతగాడిమీద తన ప్రేమ ఒక్కఆకాశమంతకాదు..అంతకుమించి.ఒక్క.మాటలో
చెప్పాలంటే వేల ఆకాశాలంత ఇష్టం.అవును మరి.. అతగాడిమీద ప్రేమ అలాంటిది..ఇందులో రహస్యం
ఏం లేదు.అంతా బహిరంగమే..ఓ చప్పుడు చేయని మాటను,తడవ తడవకు తలిచే మాటను అతగాడికి
వినిపించాలన్నది ఆమె కోరిక.అప్పుడప్పుడు తడబడుతూ,తడుముకుంటూ చెప్పాలనిపిస్తోందట.
గుంపు మధ్య వున్నా..గుసగుసగా చెప్పాలనిపిస్తోందట.ఎవరూ లేని చోట ఆదమరిచి అరిచి మరీ
చెప్పాలనిపిస్తోందట…
ఇంతకూ అతగాడికి చెప్పాలనుకుంటున్న… మాటేమిటి?
ఇంకేముంటుంది?
I Love You..”నేను నిన్ను ప్రేమిస్తున్నాను”
ఓయ్..నిన్నే…
ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా.?
వేల ఆకాశాలంత…
నా ప్రేమను నువ్వు అంచనా వేయలేనంత..
ఒక్క ఆకాశాన్నే మనం అంచనా వేయలేం…
ఇక వేయి ఆకాశాలంటే మీరే అర్ధం చేసుకోండి
ఆ ప్రేమ ఎంత ? అన్నది…!!
ఇదండీ..ఆ ప్రేమికురాలు తన ప్రియుడితో చెప్పాలనుకున్న మాటనుఇలా..గుండె గొంతు
విప్పి మరీ చెప్పింది..!
ప్రేమను తూచడం,అంచనా వేయడం,విస్తీర్ణం .. లెక్కించడం ఎవరితరం..??
అంచనా వేయలేని ప్రేమ విలువనుచాటి చెప్పే రమాదేవి కవిత ఇది…
*ఎ.రజాహుస్సేన్..!!